జయ జానకి నాయక నష్టాలు ఎంత, లై నష్టం ఎన్ని కోట్లో చూడండి

నితిన్ సినిమాలు నెగేటివ్ టాక్ తో కూడా మార్కేట్ విస్తరించని సమయంలో పది కోట్ల షేర్ అలవోకగా దాటేవి. హార్ట్ ఎటాక్ మీద పూరి జగన్నాథ్ బ్రాండ్ పనిచేసింది అనుకుందాం, మరి నెగెటివ్ టాక్ ఉన్న చిన్నదానా నీకోసం సినిమాని మాత్రం లాగింది నితినే కదా. ఇక మార్కెట్ కొద్దిగా విస్తరించగా త్రివిక్రమ్ అండతో 45 కోట్ల మార్కు చేరుకున్నాడు నితిన్. మరి అలాంటి మంచి మార్కెట్ ఉన్న హీరో సినిమా పట్టుమని పది కోట్లు దాటడానికి కూడా తంటాలు పడుతుందని ఎవరు ఊహించారు?

బోయపాటి శ్రీను అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. మాస్ సెంటర్స్ లో ఆయనకీ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మాస్ ప్రేక్షకులు ఎగబడి చూస్తారు ఆయన సినిమాల్ని. అలాంటి బోయపాటి శ్రీను సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించారు?