జబర్దస్త్ నుండి "రోజా" అవుటా.? కారణం ఏంటి.? మొన్నటి ఎపిసోడ్ లో జడ్జిగా రష్మీ.?    2018-05-21   00:36:46  IST  Raghu V

విమర్శలు,వివాదాల నడుమనే ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న షో జబర్దస్త్..ప్రోగ్రం పట్ల,ప్రోగ్రాంలో వచ్చే బూతుల పట్ల అసహనం ఉన్నప్పటికి అత్యధిక టిఆర్పీతో నడుస్తున్న షో ఏదన్నా ఉందంటే అది జబర్దస్తే..అలాంటి ప్రోగ్రామ్ ఇప్పటివరకూ ఎందరో కమెడియన్స్ ని వెండితెరకు పరిచయం చేసింది.వెండితెరపై అవకాశాలు లేని వారికి అవకాశం ఇచ్చి ఆదుకుంది.ఇన్నేళ్ల ఈ ప్రోగ్రామ్లో మారనిది ఏదన్నా ఉందంటే అది జడ్జిలు ,యాంకర్లు మాత్రమే.

జబర్దస్త్ షో కి మొదట యాంకరింగ్ చేసింది అనసూయనే..తరవాత సినిమా అవకాశాలు రావడంతో రష్మికి ఆ బాద్యతలు అప్పచెప్పారు..బుల్లితెరకు గ్లామర్ సొగసులద్దారు ఈ ఇద్దరూ..తర్వాత అనసూయ తిరిగొచ్చాక జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ వారానికి రెండు సార్లు ప్రోగ్రామ్ ని డివైడ్ చేసి ఒక రోజు రష్మి,ఒక రోజు అనసూయ యాంకరింగ్ చేసేలా ఒప్పుకున్నారు.కాని నాగబాబు,రోజా మాత్రం రెండు ప్రోగ్రామ్లకు జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు..మొన్నామధ్య రోజా ప్లేస్ ను మంచు లక్ష్మి భర్తీ చేస్తుందన్నారు కాని అది కుదర్లేదు..కాని ఈ సారి రోజా జబర్దస్త్ నుండి తప్పుకుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దానికి ఊతం ఇస్తుంది వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో.