జనసేనలోకి నాగబాబు ఎందుకు వెళ్ళలేదు?

పవన్ కళ్యాణ్ కి , నాగబాబు కి మధ్య అన్నదమ్ముల రిలేషన్ ఒక్కటేకాదు వాళ్ళు ఇద్దరూ మంచి స్నేహితుల్లా కూడా ఉంటారు అని టాక్. నాగబాబు ఆరెంజ్ సినిమా తీసి చేతులు కాల్చుకున్నప్పుడు పవన్ ఆర్ధికంగా చాలా సపోర్ట్ ఇచ్చాడు. తాను ఆ ఇబ్బందిక‌ర పరిస్థితుల నుంచి బయటపడానికి చాలా శ్రమించానని..అందుకు బుల్లితెర సపోర్ట్ కూడా చాలానే ఉందని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు నాగబాబు.

అలాగే ప‌వ‌న్ జనసేన పార్టీ గురించి ప్రస్తావిస్తూ జనసేనలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కనిపిస్తుంద‌ని తానూ కూడా పార్టీలో కి రావడం ఇష్టం ఉన్నా.. ఫైన‌ల్ డెసిష‌న్ మాత్రం ప‌వ‌న్‌దే అని నాగ‌బాబు స్ప‌ష్టం చేశాడు. తాను పార్టీ లోకి వస్తే పవన్ కి మేలు జరగక పోయినా పరవాలేదు కాని,తన వాళ్ళ ఎటువంటి నష్టం పవన్ కి రాకూడద‌న్న‌దే త‌న ఉద్దేశ‌మ‌ని నాగ‌బాబు చెప్పారు.

పవన్ త‌న‌ను పిలిచి పార్టీ కార్యకర్తగా పని చేయమని చెప్పినా పని చేస్తా, త‌న‌కు పదవులతో పనిలేదని అన్నారు నాగబాబు. నేను పడ్డ కష్టం చూశాడు కాబట్టే నన్ను పార్టీ లోకి పిలవక పోవడానికి కారణం అయ్యి ఉండవచ్చని, అయితే ఇకపై తానూ అంతగా కష్ట పడవలసిన అవసరం లేద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఒక తమ్ముడిగా కంటే కూడా ఒక వ్యక్తిగా,సమాజం కోసం పరితపించే గొప్ప మనిషిగా ప‌వ‌న్ నాకు చాలా ఇష్టం అని తన తమ్ముడి మీద ప్రేమని నాగ‌బాబు బ‌య‌ట‌పెట్టారు. ఇక నాగబాబు పేరు జ‌న‌సేన నుంచి కాకినాడ ఎంపీ సీటుకు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.