జనసేనపై చరణ్‌ ఆసక్తి.. ఇదే సాక్ష్యం     2018-05-24   22:20:32  IST  Bhanu C

గతంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపింపిచనప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు అయిన రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌ ప్రత్యేక ప్రచారం చేసిన విషయం తెల్సిందే. ఇక పవన్‌ కళ్యాణ్‌ అప్పట్లో చాలా యాక్టివ్‌గా యువ రాజ్యం అధ్యక్షుడా రాజకీయాలు చేశాడు. అయితే అనుకున్న స్థాయిలో ప్రజారాజ్యం ప్రజల నమ్మకంను పొందడంలో విఫలం అయ్యింది. అదే సమయంలో కాంగ్రెస్‌ సీఎం రాజశేఖర్‌ రెడ్డి ముందు ఆ పార్టీ నిలబడటంలో విఫలం అయ్యింది. దాంతో చిరంజీవి చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశాడు. ఇదంతా గతం, ప్రస్తుతం విషయానికి వస్తే పవన్‌ పార్టీ జనసేన వైపు అందరు చూస్తున్నారు.

మొదట జనసేనను కూడా మరో ప్రజారాజ్యం అంటూ అంతా విమర్శలు చేశారు. కాని పవన్‌ వేస్తున్న ఒక్కో అడుగు ప్రజల్లో నమ్మకంను కలిగిస్తుంది. అధికారం ముఖ్యం కాదు, ప్రజల సమస్యలపై పోరాడటం తనకు ముఖ్యం అంటూ పవన్‌ చెబుతూ వస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా ఎంతో మంది అభిమానులు మరియు నాయకులు కూడా నిలుస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా రామ్‌ చరణ్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బాబాయి ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఆయన్ను చూస్తే గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.