జనసేనపై “ఆ నలుగురు” టాక్ ఇదే

రాజకీయ నాయకుడు అంటే వ్యూహం, ప్రతి వ్యూహం ,లౌక్యం, చెదరని చిరునవ్వు ,కోపం ఉన్నా సరే వ్యక్తపరచక పోవడం ప్రజాకర్షణ , ప్రజల క్రేజ్ ని ఓట్లుగా మలుచుకోవడం ఇలా ఒకటేమిటి అన్ని విషయాలలో ఆరితేరి ఉండాలి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తనకి కొంచం తిక్క ఉంది కానీ దానికో లేక్కుంది అని చెప్తున్నా పవన్ తిక్కకి లెక్క ఎక్కడా కనపడటం లేదనేది బహిరంగ విమర్శ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హుందాగా రాజకీయాలు చేస్తుంటే తనకి ఫ్యాన్స్ మద్దతు ఎలా ఉందొ ప్రజా మద్దతు కూడా అలాగే ఉండేదేమో కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మద్దతు సైతం ఒక్కో స్టేజి లో తగ్గిపోతోంది..అసలు పవన్ పార్టీ గురించి మాట్లాడుకుంటే

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి ఏ నలుగురు మాట్లాడుకున్నా సరే చేస్తున్న వ్యాఖ్యలు ఇవే రాజకీయాలని తన సిద్దాంతాల ప్రాతిపదికన చేస్తానని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ ఫ్లాప్ అవుతున్నాడని అంటున్నారు మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో సీఎం పీఠం కోసం పార్టీలు, నేతల మధ్య హోరా హోరీ పోరు సాగనుంది…అయితే ఇలాంటి సమయంలో తాను కూడా అధికార పీఠానికి తక్కువా? అంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్‌.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల్లో తిరుగుతున్నారు.