జగన్ చేతిలో బ్రహ్మాస్త్రం..దీంతో టీడీపీ పని ఖతం     2018-04-14   07:19:18  IST  Bhanu C

ఇప్పటి వరకూ ఉన్న రాజకీయాలు ఒక ఎత్తు ఇక మీదట జరుగబోయే రాజకీయాలు మరొక ఎత్తు..విభజన అంశం దృష్టిలో పెట్టుకుని ఎవరికీ వారు ఏపీ ప్రజల దృష్టిలో హీరోలో అయిపోవాలని వ్యూహ రచనలు చేస్తున్నారు ఒక పక్క అస్సలు ప్రత్యేక హోదా అవసరం లేదు అన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తూచ్ అంటూ ప్రత్యేక హోదా ముద్దు అంటూ యూ టర్న్ తీసుకున్నారు..నిరాహార దీక్షలు..నిరసనలు,ర్యాలీలు అంటూ మరో పక్క ప్రజలని ఊదర గొడుతూ వారి వారి పబ్బం గడుపుతున్నారు..మోడీ తో డీ అంటే డీ అంటున్నారు…ఇదిలాఉంటే

అసలు ముందు నుంచీ ప్రత్యేక ఉద్యమాన్ని భుజాన మోసింది మాత్రం వైసీపి అనడంలో సందేహం లేదు..కేంద్రంపై అవిశ్వాసాన్ని ఎక్కుపెట్టి ప్రతిపక్ష పార్టీ పాత్రని ఎంతో భాద్యతగా నిర్వర్తించింది..ఏపీలో నిరాహార దీక్షలు చేస్తూ కేంద్రంపై కాలు దువ్వుతూ ఏపీ ప్రజల హక్కుని తన పార్టీ తరుపున అడిగింది..వాస్తవానికి జగన్ ముందుకు కదిలిన తరువాతనే పవన్ కళ్యాణ్ కానీ ,తెలుగుదేశం కానీ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు..అయితే కేంద్రానికి సవాల్ విసురుతూ మరింత ఒత్తిడి పెరిగేలా తన ఎంపీల చేత రాజీనామాలు చేయించాడు జగన్ మోహన్ రెడ్డి..దాంతో ఒక్కసారిగా కేంద్రంపై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది..