జగన్ చెంతకి “రఘువీరా రెడ్డి”     2018-05-28   01:12:24  IST  Bhanu C

ఏపీలో కీలక పరిణామాలు చాపకింద నీరులా మెల్లగా జరుగుతున్నాయి..ఎంతో మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లోగా వేరే పార్టీలలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు..ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుంచీ వైసీపిలోకి ఈ వలసలు ఎన్నికల సమయంలో జోరుగా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు కేవలం టీడీపి నుంచీ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపి ల నుంచీ కూడా వైసీపిలోకి సీనియర్ నేతలు క్యూ లు కడుతున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కి కోలుకోలేని షాక్ త్వరలో తగలబోతోందని కాంగ్రెస్ కీలక నేత వైసీపిలోకి జంప్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ నేత ఎవరు ఏమిటా కధ అంటే..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లోకూడా చావు దెబ్బ తగులుతుందని భావిస్తున్న ఆ పార్టీ ముఖ్యనేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపిలోకి మెల్లగా జంప్ అవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నారు..అందులో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి జగన్ పార్టీలో కి జంప్ అవ్వడానికి సర్వం సిద్దం చేసుకున్నారట…ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డి వైసీపిలోకి వెళ్ళాలని అనుకోవడమే కాదు ఈ సారి హిందూ పురం నుంచీ ఎంపీగా పోటీ చేయాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమలోనే రఘువీరా రెడ్డి కర్నాటక ఎన్నికల సమయంలో “జగన్‌” పై విమర్శలు, ఆరోపణలు చేయకపోవడానికి అదే కారణమని కాంగ్రెస్‌ నాయకులు కూడా అనుమానిస్తున్నారు. వై.ఎస్‌కు అత్యంత సన్నిహితుడైన రఘువీరారెడ్డి పదేళ్లపాటు..మంత్రిగా బాధ్యతలు నిర్వహించి..అనంతపురం జిల్లాలో అధికారం చెలాయించిన విషయం విధితమే..అయితే ఇంతకు ముందే రఘువీరారెడ్డి టిడిపిలో చేర్పించాలని కొందరు టిడిపి నేతలు ప్రయత్నించినా సరే మంత్రి సునీత, అనంతపురం ఎంపి దివాకర్‌రెడ్డి తీవ్రంగా రఘువీరా చేరికని వ్యతిరేకించారు. తాజాగా…కొంత మంది మధ్యవర్తుల ద్వారా ‘జగన్‌’ ‘రఘువీరారెడ్డి’తో మంతనాలు చేయిస్తున్నట్లు తెలిసింది.