“జగన్” కి కష్టాలు తెచ్చి పెడుతున్న “జగన్ సొంత సర్వే”     2018-04-26   22:17:55  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రజా క్షేత్రంలో దూసుకుని వెళ్తోంది..ప్రజలు అందరూ బ్రహ్మరధం పడుతున్నారు..ఎక్కడికి వెళ్ళినా సరే జై జగన్ అంటూ నినాదాలు మారు మోగుతున్నాయి..అయితే ఇదంతా గతం అంతేకాదు గతంలో కొన్ని ప్రాంతాలవరకూ జగన్ మైలేజ్ బాగానే ఉన్నా సరే తరువాత అరువు తెచ్చుకున్న ప్రజలతో పాదయాత్ర ముందుకు సాగుతోంది.రాయలసీమలో వచ్చిన రెస్పాన్స్ ప్రకాశం జిల్లా వచ్చేసరికి డీలా పడిపోయింది..అంతేకాదు గుంటూరు ,ప్రకాశం ,కృష్ణా జిల్లాలు వచ్చేసరికి మరింతగా జగన్ గ్రాఫ్ తగ్గిపోయిందట అయితే ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న బీజేపి అధిష్టానం జగన్ కి ఆదరణ తగ్గుతున్న క్రమంలో పీకే కి పాదయాత్రకి సంభందించిన రిపోర్టులు ఇవ్వమని చెప్పిందట.

అయితే పీకీ ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో చేయించే రిపోర్టులని బీజేపి అధిష్టానానికి పంపాడట దాంతో ఆ రిపోర్ట్స్ చూసినబీజేపి అధిష్టానానికి మరియు జగన కి దిమ్మ తిరిగిపోయిందట..ఎంతో మంది తమ తమ అభిప్రాయాలని ఒకే విధంగా తెలుపడం ఆశ్చర్యం కలిగించిందట..పాదయాత్ర పరంగా సక్సెస్ అవుతున్న జగన్ శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కేసరికీ అప్పటి వరకూ ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యిపోతోందట..ఈ విషయాన్ని అందరు ఒకే లా తమ తమ అభిప్రాయాల్ని తెలిపారట..