జక్కన్న, కొరటాల, సుక్కూ సేమ్‌ టు సేమ్‌ (వాటా లాగేస్తున్నారు)     2018-05-24   01:04:55  IST  Raghu V

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌ దర్శకులు ఎవరు అంటే ఠక్కున వినిపించే మూడు పేర్లు రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్‌. ఈ ముగ్గురు వరుస విజయాలతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నారు. ఈ ముగ్గురి దర్శకత్వంలో నటించేందుకు స్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌, మెగాస్టార్స్‌ కూడా ఆసక్తిగా ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారీ అంచనాల నడుమ ఈ ముగ్గురి సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఈ ముగ్గురు చేస్తున్న సినిమాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు.

ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా సినిమా చేయకుండా, తమ తర్వాత సినిమా ఏర్పాట్లలో ఉన్నారు. ఈ ముగ్గురు త్వరలోనే వారి వారి సినిమాలను మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక ఈ ముగ్గురు పారితోషికం విషయంలో ఒకే విధంగా వ్యవహరిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొదట ‘బాహుబలి’ సినిమాకు రాజమౌళి పారితోషికం మాట్లాడుకున్నాడు. అయితే ఆ సినిమా స్థాయి పెరగడంతో పారితోషికంతో పాటు నిర్మాతలు లాభాల్లో వాటాను కూడా ఇచ్చారు. బాహుబలి వల్ల జక్కన్నకు దాదాపుగా 60 కోట్లకు పైగానే ముట్టినట్లుగా తెలుస్తోంది.