ఛాయ్ అమ్మి 45 కోట్లు సంపాదన .. ఎలాగో తెలిస్తే షాక్     2018-05-21   00:29:25  IST  Raghu V

ఈ పాట గుర్తుంది కదూ , ఛాయ్ గొప్పతనం గురించి చిరంజీవి సినిమా పాటలో విన్నాం ,కానీ ఆ ఛాయ్ తో మిలియనీర్ అయిన ఒక మహిళ కథ ఛాయ్ అంటే భారతీయులకు ప్రాణం ఎక్కడ ఉన్నా పని చేసాక అలసట తీర్చువడానికి ఛాయ్ తాగుతం దానితో మనకు కొత్త ఉల్లాసం వస్తుంది.టీ అమ్మి మన దేశానికి ప్రధాని అయినపుడు టీ తో 45 కోట్లు సంపాదించండం ఏముంది. చాయ్ తో రోజుకు వెయ్యి సంపాదించడం చాలా కష్టం, మనకి ఒక 100 టీ షాప్ లు ఉన్న కోట్ల బిసినెస్ చేయడం మాములు విషయం కాదు , కానీ ఒక మహిళ ఏకంగా 45 కోట్ల రూపాయలు కేవలం టీ అమ్మి సంపాదించింది.నమ్మశక్యం లేదా.. ఈ విషయం చెప్పింది అమెరికన్ వీక్లీ మ్యాగజైన్ ,అది కూడా మన దేశ ఛాయ్ పుణ్యమే మరి..

అసలు కథేంటి?

ఛాయ్ అమ్మితే కోట్లు వస్తాయా అని ఆలోచన వస్తుంది కదూ, అసలు విషయం ఏంటంటే అమెరికా లో కాలరాడో కు చెందిన మహిళ బ్రూక్ ఎడ్డీ 2002 లో భారత్ కి వచ్చింది.దేశం లో ఉన్న చాలా పర్యాటక ప్రాంతాలను తిరిగింది , ఆ సమయం లో మన దేశ వంటకాల రుచి చూసింది. ఇక్కడ టీ ఆమెకి విపరీతంగా నచ్చింది. ఆ పర్యటన ముగించుకొని తిరిగి కాలరాడో కి వెళ్ళింది , అక్కడ కేఫ్ లో టీ తాగింది , అయితే భారత్ లో ఉన్న టీ లాగా రుచిగా అక్కడి టీ లేకపోవడం తో ఆమెనే ఒక టీ స్టాల్ లాగా ఒక కేఫ్ పెట్టాలని అనుకుంది.