చుండ్రు సమస్య వేధిస్తోందా....అయితే ఈ ఆయిల్స్ ట్రై చేయండి    2018-05-08   01:03:21  IST 

చుండ్రు రావటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. చుండ్రు ఉన్నప్పుడు త‌ల‌పై ఉన్న చ‌ర్మం పొట్టుగా మారి రాలుతుంది. ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, పోష‌ణ లోపం వంటి అనేక కార‌ణాలు చుండ్రు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. అయితే ఈ చుండ్రు సమస్య నుండి బయట పడటానికి కొన్ని సమర్ధవంతమైన ఆయిల్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

టీ-ట్రీ-ఆయిల్ టీ-ట్రీ-ఆయిల్ లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రుకు కారణం అయినా బ్యాక్టీరియాను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. మనం రెగ్యులర్ గా వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ-ట్రీ-ఆయిల్ వేసి తలస్నానము చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేయాలి.