చుండ్రును శాశ్వతంగా తరిమి కొట్టే అద్భుతమైన రోజ్ మేరీ పౌడర్  

ఒక కప్పు నీటిలో రోజ్ మేరీ పొడి వేసి బాగా మరిగించాలి. ఆ నీరు ముదురు గోధుమరంగులోకి వచ్చే దాకా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక వడకట్టి ఒక బౌల్ లో తీసుకోవాలి. ఈ మిశ్రమంలో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపాలి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ తల మీద చర్మాన్ని శుభ్రం చేయటానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరినూనె కలపాలి. కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో జుట్టుకు బాగా పట్టించి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.