చుండ్రును శాశ్వతంగా తరిమి కొట్టే అద్భుతమైన రోజ్ మేరీ పౌడర్    2018-06-05   00:05:16  IST 

చుండ్రు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. ఎన్ని రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మార్కెట్ లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూలు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. కానీ శాశ్వతంగా చుండ్రును తరిమికొట్టవు. అందువల్ల సహజసిద్ధమైన పదార్ధలను ఉపయోగించి చుండ్రును తరిమి కొట్టవచ్చు. వాటిలో రోజ్ మేరీ పౌడర్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

రోజ్ మేరీ పౌడర్ లో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన తల మీద చర్మంపై ఉండే డాండ్రఫ్ కారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే తల మీద చర్మంపై రక్తప్రసరణను పెంచుతుంది. అదనంగా ఉత్పత్తి అయ్యే నూనెను కూడా నిరోధిస్తుంది. అయితే చుండ్రు నివారణకు రోజ్ మేరీ పొడి ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.