చింతమనేని పై బాబు సర్వే .. టికెట్ కట్ ..?     2018-06-02   01:09:35  IST  Bhanu C

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ .. టీడీపీకి కంటిలో నలుసులా మారిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఈసారి ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమే అని తెలుస్తోంది. మొదటి నుంచి ప్రభాకర్ ది వివాదాస్పద వ్యవహారశైలి. అధినేత చంద్రబాబు ఆయన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మాత్రం తన బాట తనదే అన్నట్టు ముందుకు వెళ్లిపోతుంటాడు. నియోజకవర్గం లో కూడా అభివృద్ధి ని పట్టించుకోకుండా ఒక నియంతృత్వ ధోరణిలో అధికారులను, సామాన్యులను వేధిస్తున్నాడని ప్రచారం ఉంది. నరనరాల్లో పసుపురక్తం నిండిన వారు కూడా ఇప్పుడు టీడీపీకి దూరం జరిగి పక్కపార్టీల వైపు చూస్తున్నారంటే దానికి ప్రభాకర్ వ్యవహార శైలే కారణం. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంపై చేయించిన సర్వేలో కూడా ఇదే తేలడంతో చింతమనేని ని పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నాడు అధినేత చంద్ర బాబు .