చర్మంపై దద్దుర్లు,దురద తగ్గాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు     2018-05-06   00:45:46  IST  Lakshmi P

దద్దుర్లు వచ్చాయంటే విపరీతమైన దురద,మంట వస్తాయి. దురద అనేది కొన్ని రకాల ఆహార పదర్ధాల కారణంగా వస్తుంది. దద్దుర్లు కొన్ని కీటకాలు కుట్టినప్పుడు కూడా వస్తాయి. అయితే దద్దుర్లు వచ్చినప్పుడు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం కూడా లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరినూనె
దద్దుర్లు ఉన్న ప్రదేశంలో కొంచెం కొబ్బరి నూనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉండాలి. కొబ్బరి నూనె మాయిశ్చ‌రైజ‌ర్‌లా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియ‌ల్ లక్షణాలు ఉండుట వలన దురదను తగ్గించి దద్దుర్ల మంటను తగ్గిస్తుంది. అయితే ఆర్గానిక్ కొబ్బరినూనెను మాత్రమే ఉపయోగించాలి.