చనిపోవడానికి సిద్దం దేనికీ భయపడను..చంద్రబాబు పై పవన్ షాకింగ్ కామెంట్స్     2018-04-20   02:06:58  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకి స్పందిచారు..తనపై వస్తున్న ఆరోపణలకి..తనపై జరుగుతున్న దాడికి తీవ్రంగా స్పందిచారు..ఎన్నో సంచలన కామెంట్స్ చేశారు…చంద్రబాబు పుట్టిన రోజు అనే కనికరం కూడా లేకుండా ఒక్కసారిగా విరుచుకు పడ్డారు..ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మరో మారు చంద్రబాబు లోకేష్ లని ఏకి పడేశారు.. పవన్ చేసిన తాజా ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది ఇంతకీ వివరాలలోకి వెళ్తే..

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.. తనను ఏళ్ల తరబడి సంబంధం లేని వివాదాల్లోకి పదే పదే లాగుతున్న ఆవేదనను వ్యక్తం చేయటమే కాదు.. అంతలా వేధిస్తున్నప్పుడు పరువు పోతుందని భయపడతారా? అంటూ ప్రశ్నించారు. తనను టార్గెట్ చేస్తున్న వారు అధికారంలో ఉన్న వారు.. మీడియాను చేతిలో పట్టుకున్న వాళ్ల అంగబలం గురించి ప్రస్తావించిన పవన్.. ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే అసలు దేనికైనా భయపడతాడా?.. వెనక్కి తగ్గుతాడా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

అంతేకాదు ఈ క్షణం నుంచి ఎప్పుడైనా చనిపోవటానికి సిద్ధపడే వెళుతున్నట్లుగా పవన్ సంచలన కామెంట్స్ చేశారు..తానూ ఈ పోరాటంలో మరణించినా నేను ఎంతో కొంత పోరాడి చనిపోయాను అనుకుంటే చాలు అంటూ తెలిపారు దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా.. రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలాన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం సంచలనంగా మారింది…అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే పోరాటం మొదల్లోనే.. మిగిలిన వారికి భిన్నంగా మరణం గురించి పదే పదే మాట్లాడుతున్న పవన్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అసలు పవన్ పెట్టిన ట్వీట్ లు రెండు పరిశీలిస్తే..