చక్రం తిప్పిన లోకేష్..తప్పుకున్న గల్లా అరుణ..అసలు రీజన్ ఇది...     2018-05-04   23:30:03  IST  Bhanu C

లోకేష్ బాబు ఎంట్రీ కోసం చంద్రబాబు చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జ్ అయిన మాజీ మంత్రి ,సీనియర్ లీడర్ మరియు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కి తల్లి అయిన గల్లా అరుణకి చెక్ పెట్టారు..పుత్రుడి కోసం మా నేతనే తప్పుకోమని చెప్తారా అంటూ గల్లా అరుణ మద్దతు దారులు ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు..అయితే ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచీ తప్పుకుంటున్నారు అంటూ ప్రకటన చేశారు…అయితే ఈ ప్రకటన వెనుక ఉన్న నిజా నిజాలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి..చంద్రగిరిలో అసలేం జరిగింది..? అరుణ అసలు ఎందుకు తప్పుకున్నారు అనే వివరాలోకి వెళ్తే..

లోకేష్ బాబు మంత్రి అవ్వడంకోసం ముందుగా ఎమ్మెల్సీ ని చేసి ఆపై మంత్రి వర్గంలోకి తీసుకుని వచ్చారు అంటే ప్రజల చే ఎన్నుకోబడ్డ నాయకుడు కాదు అయితే ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్న లోకేష్ బాబు కి ఓటమి లేకుండా తెలుగుదేశం కంచుకోటలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతూ వెళ్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నియోజక వర్గాన్ని బలమైన తెలుగుదేశం కోటలుగా చేసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు లోకేష్ కోసం త్యాగం చేయాలి..ఇదీ అసలు కాన్సెప్ట్.