చంద్రబాబు విషయంలో షా కి తలంటిన ఆరెస్సెస్     2018-06-03   01:10:49  IST  Bhanu C

ఏపీ రాజకీయాల్లో సక్సెస్ఫుల్ నేతగా ఎంతో అపారమైన అనుభవం ఉన్న నేతగా ఉన్న ఏకైక వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయిలో చంద్రబాబు కి ఉన్న క్రేజ్ మరే రాష్ట్ర సీఎం కి లేదనడంలో సందేహం లేదు..ఒకానొక దశలో ప్రధానిగా అవకాశం వచ్చినా సరే తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటూ సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి ఆయన ఎంతో మంది రాజకీయ నేతలని మనం గమనిస్తే వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా కోపంగా ఉద్రేకంగా స్పందిస్తారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఒక పార్టీ అధ్యక్షుడు అనే విషయాన్ని సైతం మర్చిపోయి ప్రవర్తిస్తారు అయితే రాజకీయాల్లో హుందాగా ఉండాలి అన్నా..రాజకీయాలని తన చుట్టూ తిప్పుకోవాలన్నా అది కేవలం చంద్రబాబు నాయుడికే చెల్లింది.


అయితే అలాంటి నేతని ఈ మధ్యకాలంలో బీజేపి తన స్వార్ధ రాజకీయం కోసం ఎన్నో ఇబ్బందులకి గురిచేసింది..అంతేకాదు చంద్రబాబు లాంటి వ్యక్తి కళ్ళ వెంట నీరు కారే పరిస్థితికి తీసుకువచ్చి రాక్షసానందం పొందింది వైసీపితో ,జనసేనతో కుమ్మక్కయ్యి చంద్రబాబు ని ఒంటరి చేస్తూ ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూసింది..చేస్తోంది కూడా అయితే ఇక్కడ బీజేపి పార్టీ చేస్తోంది అనేకంటే కూడా నరేంద్ర మోడీ ,అమిత్ షా ల ద్వయం చేస్తోంది అని చెప్పడం భావ్యం..