చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్..అసలేం జరుగుతోంది..?     2018-04-29   22:14:02  IST  Bhanu C

ఫోన్ ట్యాపింగ్ దీని గురించి అందరికి తెలిసిందే ఈ ట్యాపింగ్ విషయంలో హై ప్రొఫైల్ వ్యక్తులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు..ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఈ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది నేటి రాజకీయాల్లో మనం వ్యూహాల కంటే ప్రత్యర్ధి వ్యూహాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం…అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఇప్పుడు మిగిలిన పార్టీలకి అంతుబట్టడం లేదు తిమ్మిని బిమ్మి చేయగల సమర్ధుడు చంద్రబాబు నాయుడు అలాంటిది చివరి నిమిషంలో ప్రజలని తనవైపుకి తిప్పుకోవడానికి తానూ వేసే ఎత్తులకి తలపండిన నేతలు సైతం అవ్వాక్కయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్న వార్త ఏమిటంటే..చంద్రబాబు తో పాటు దేశం లో ఇతర కీలక నేతల ఫోన్లు టాపింగ్ కి గురి అవుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి.

చాలా అధునాతన పరిజ్ఞానం తో ఎప్పటికప్పుడు ట్యాపింగ్ విధానం మారుస్తున్నట్టు సమాచారం…అయితే చంద్రబాబు ఫోన్ ట్యాప్ అవుతున్నట్లుగా ముందే గ్రహించారట చంద్రబాబు ఎలా అంటే తొలి విడత బడ్జెట్ సమావేశాల సమయంలో మూడవ రోజున తమ వ్యూహాలు ముందే తెలిసినట్టు గా కేంద్రం తమని చర్చలకు పిలవటం, తాము ఇంకా అడగని డిమాండ్స్ గురించి కూడా ప్రస్తావించటం చూసి చంద్రబాబు సందేహం వ్యక్తం చేసారట.