చంద్రబాబు కి మొగుడి కోసం జ‌గ‌న్ వ‌ల‌..!     2018-05-12   22:11:31  IST  Bhanu C

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వ్య‌క్తుల‌తో సంబంధం లేదు. పార్టీల గెలుపే పార్టీ సార‌ధుల‌కు ప్ర‌ధానం. ఈ క్ర‌మంలో ఎవరు ఎటు వైపు నుంచి వ‌చ్చి పార్టీలో చేరినా.. త‌మ‌కు అనుకూలంగా ఉంటే చాలు! త‌మ‌కు మైలేజీ పెరిగితే ప‌దివేలు! ఇప్పుడు ఈ సూత్రంమీదే ఏపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ సూత్రాన్ని పుణికి పుచ్చుకున్న సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ ఎమ్మెల్యేలను త‌న పార్టీలోకి చేర్చుకుని అంద‌రినీ నివ్వెర ప‌రిచారు. జ‌గన్‌ను బ‌ల‌హీనుడిని చేయ‌డం, వైసీపీ హ‌వాను త‌గ్గించ‌డ‌మే అజెండాతో ఆయ‌న‌.. చంద్ర‌బాబు త‌ల న‌రికినా త‌ప్పులేదు- అని వ్యాఖ్యానించిన పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని సైతం ఆనందంగా పార్టీలో చేర్చుకున్నారు.

మ‌రి సీనియ‌ర్‌గా రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాన‌ని చెబుతున్న చంద్ర‌బాబే ఇలా చేస్తే.. జ‌గ‌న్ ఇంకెంత చేయాలి? ఇప్పుడు ఆ దిశ‌గానే జ‌గ‌న్ కూడా అడుగులు వేస్తున్నాడ‌ని స‌మాచారం. వైసీపీలో ఇప్పుడున్న నాయ‌కులు చంద్ర‌బాబుకు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని జ‌గ‌న్ చాలా రోజులుగా ఫీల‌వుతున్నాడు. అంత‌ర్గ‌తంగా బాబును టార్గెట్ చేసేలా ఆయ‌న ఎన్ని విధాల సూచ‌న‌లు చేసినా.. ఎవ‌రూ పెద్ద‌గా పోరు చేయ‌లేక పోతున్నారు. కేవ‌లం విజ‌య‌సాయి రెడ్డి, రోజా వంటి వారు మాత్ర‌మే బాబుకు స‌రైన కౌంట‌ర్ ఇస్తున్నారు. అయినా కూడా అంత ఎఫెక్ట్ క‌నిపించ‌డం లేదు. అందుకే జ‌గ‌న్ త‌న ప్ర‌య‌త్నాలను ఉధ్రుతం చేస్తున్నారు.