“చంద్రబాబు కి టార్గెట్ ” ఇచ్చిన పవన్..లేకపోతే “నిరాహార దీక్ష”     2018-05-23   02:46:59  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఎండని సైతం లెక్క చేయకుండా చేస్తున్న యాత్ర చూస్తుంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికేనని ఏపీ ప్రజలు అర్థం అవుతోంది..శ్రీకాకుళ జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు ,టీడీపీ పై నిప్పులు చెరుగుతున్న పవన్ కళ్యాణ్ తన స్పీడుకి బ్రేకులు వేయడంలేదు పలాస ఎమ్మెల్యే అల్లుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు ,లోకేష్ లపై మాత్రమే కాదు టీడీపీ నేతలని సైతం టార్గెట్ చేస్తున్నానని చెప్పకనే చెప్పారు..ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు..

టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ పెట్టారు..చంద్రబాబు మీకు 48 గంటలు గడువు ఇస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..ఇంతకీ ఈ 48 గంటలు గడువు ఎందుకు అంటే…రాష్ట్ర ప్రజల ప్రాణాలను పట్టించుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు..ఏపీ ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనా అంటూ ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోడానికి, ఆరోగ్య శాఖ ను పర్యవేక్షించడానికి హెల్త్ మినిస్టర్ లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.