గడపకి పసుపు రాయడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా? Devotional Bhakthi Songs Programs  

సాధారణంగా ఒక ఊరిలో జనాభా గురించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎన్ని గడపలు వున్నాయనే ప్రస్తావన రావడం మనం తరచుగా చూస్తూనే వుంటాం. అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం తెలియజేస్తుంది. మన పూర్వీకులు భూమికి … ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు. భూమికి … ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై కూర్చుని హిరణ్య కశిపుడిని నరసింహస్వామి సంహరించిన విషయం కూడా మనకు తెలిసిందే.

గడప శ్రీ మహాలక్ష్మీ స్థానం … అందుకనే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం మనకు అనాదిగా ఆచారంగా వస్తోంది. ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లో ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగాని జరగదు.