క‌డ‌ప వైసీపీలో ఏం జ‌రుగుతోంది?     2018-05-18   01:13:02  IST  Bhanu C

ఏపీ విప‌క్షం వైసీపీకి కంచుకోట‌. పార్టీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప్ర‌స్తుతం ఆ పార్టీకి నిరుత్సాహ‌మే ఎదుర‌వుతోం దా? నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదా? దీనిని గుర్తించిన అధికార టీడీపీ దూసుకు పోయేందుకు ప్ర‌య‌త్నిస్తోం దా? అల‌సు క‌డ‌ప వైసీపీలో ఏం జ‌రుగుతోంది? నేత‌లు ఎందుకు నిరాశ‌లో కూరుకుపోతున్నారు? వ‌ంటి అంశాల‌పై చ‌ర్చ న‌డుస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుపై క‌న్నేశారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బా బు.. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌పై దృష్టి పెట్టారు.

జ‌గ‌న్ చిత్తూరు విష‌యంలో ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుం టున్నారో తెలియ‌డం లేదు కానీ, చంద్ర‌బాబు మాత్రం క‌డ‌ప‌లో పాగా వేసేందుకు జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు మాత్రం ముమ్మ‌రంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు అస‌లు క‌డప వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ‌కు అవ‌కాశం వ‌చ్చింది. కడప జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో తీవ్ర నిరాశ నెల‌కొంది. ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న భావ‌న వారిలో గూడుక‌ట్టుకుంది. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డం, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి సాగుతుండ‌గా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డ అన్న చందంగా ప‌రిస్థితి ఉండ‌డం వారికి క‌లిచివేస్తోంది.