క్రిష్‌ ఒప్పుకోవడానికి కారణం ఇదా?    2018-05-29   00:10:07  IST 

తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట దర్శకుడు తేజను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు క్రిష్‌కు అప్పగించడం జరిగింది. సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య సాదా సీదా దర్శకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే పెద్దగా అంచనాలు ఉండవని, అలాగే సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించలేక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో బాలయ్య స్టార్‌ డైరెక్టర్‌ కోసం ప్రయత్నాలు చేశాడు.

‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం నిర్మాణ వ్యయంలో దాదాపు 70 శాతంకు పైగా బాలయ్య ఖర్చు చేస్తున్నాడు. ఈ చిత్రంను పూర్తిగా బాలయ్య నిర్మించాలని భావించినా కూడా సినిమాలో నటుడిగా ఎక్కువ పాత్రలు చేయడంతో పాటు, ఇంకా కీలక విధులు నిర్వహించాల్సి ఉందని, అందుకే నిర్మాణ బాధ్యతలను సాయి కొర్రపాటికి కూడా అప్పగించడం జరిగింది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇలాంటి సినిమాను చేయాలంటే దర్శకులు కాస్త వెనుకాడుతారు. కాని దర్శకుడు క్రిష్‌ మాత్రం ఎక్కువ పారితోషికం ఆఫర్‌ చేయడంతో ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.