కొబ్బరి నీళ్లు,తేనే కలిపి త్రాగితే ఏమవుతుందో తెలుసా?     2018-04-27   02:05:15  IST  Lakshmi P

కొబ్బరినీటిలో ఎన్ని ఆరోగ్య ప్రయాణాలు ఉన్నాయో మనకు తెలిసిన విషయమే. మన శరీరానికి అవసరమైన మినరల్స్,పోషకాలను అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇక తేనే విషయానికి వస్తే తేనెలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. అంతేకాక స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరినీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కొబ్బరి నీరు,తేనే మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేసి వృద్ధాప్య లక్షణాలు తొందరగా రాకుండా చేస్తుంది. వయస్సు కారణంగా వచ్చే ముడతలు కూడా తొలగిపోతాయి.

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడి గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం.అల్సర్ వంటివి రావు.