కొన్ని గంట‌ల్లో చ‌నిపోతాన‌ని తెలిసిన న‌ర్స్…! తన భర్తకు రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లే.!     2018-05-22   23:09:52  IST  Raghu V

రోగుల‌కు చికిత్స చేస్తుండ‌గా…నిఫా వైర‌స్ నాకూ సోకింది. నాకు తెలుసు ఈ వైర‌స్ కు మందు లేద‌ని.! నేను కొన్ని గంట‌ల్లో చ‌నిపోతాన‌ని నాకు తెలుసు, చివ‌రి సారిగా మిమ్మ‌ల్ని, పిల్ల‌ల్ని కూడా చూడ‌లేన‌ని కూడా నాకు తెలుసు ఇదే నా గుండెల్ని మ‌రింతగా పిండేస్తుంది. పిల్ల‌ల్ని జాగ్ర‌త్తగా చూసుకో…వారిని గ‌ల్ఫ్ తీసుకెళ్ళు, వారిని బాగా పెంచు, నేను లేన‌ని నీవు జీవితాంతం ఒంట‌రిగా ఉండ‌కు, మా నాన్న‌లా నీ జీవితాన్ని ఒంట‌రి చేసుకోకు…. జాగ్ర‌త్త‌గా ఉండూ..దేవుడు నాకే ఇలా ఎందుకు చేశాడో అర్థ‌మ‌వ్వ‌ట్లేదు.! బై.! నా కాలం చెల్లింది.! పిల్ల‌లు జాగ్ర‌త్త‌.!! ఇది మ‌రికొద్దిసేప‌ట్లో చ‌నిపోతాన‌ని తెలిసిన ఓ న‌ర్స్ త‌న భ‌ర్త‌కు రాసిన లెట‌ర్.!

లినీ మరణంపై స్పందించిన డాక్టర్‌ దీపూ సెబిన్‌ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, నిపా వైరస్‌ సోకి పలువురు కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు నర్సులు ఉన్నారు.