కెసిఆర్ బయోపిక్ లో కెసిఆర్ గా చేసే నటుడు ఇతనే?

తెలంగాణ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితచరిత్రను వెండితెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని ప్రముఖ దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రూపొందించనున్నారు. ఈ విషయమై శ్రీధర్ ఇప్పటికే ఓ ప్రకటన చేసారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు – హిందీ భాషాల్లో రూపొందించి వచ్చే ఏడాది, కెసిఆర్ పుట్టినరోజు కానుకగా 17న విడుదల చేసే యత్నాల్లో ఉన్నారు.