కెంపు ఆడవారికి మంచిదా...మగవారికి మంచిదా?     2018-05-08   01:22:59  IST  Raghu V

కెంపులను ఇంగ్లిష్ లో రూబీ అని అంటారు. సంస్కృతంలో మాణిక్యం అని అంటారు. మన అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కరు రోజు రోజుకి అభివృద్ధి అనేది జరగాలి. వారి అభివృద్ధిని చూసి తల్లితండ్రులు చాలా సంతోషపడతారు. ఈ అభివృద్ధిని చూసి ఈర్ష్య పడేవారు ఉంటారు. ఈ ఈర్ష్య ద్వేషాల ప్రభావం పడకుండా ఉండాలంటే కెంపు జాతి రత్నాన్ని ధరించాలి.

ఎరుపు వర్ణం జాతి రత్నం ధరించటం వలన నారా దిష్టి తగ్గుతుంది. ఇలా ధరించటం వలన వారి అభివృదిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండి ఉన్నతస్థితికి చేరుకుంటారు. అలాగే వీరు చేసే ఏ పని అయినా తెలివితేటలతో చేస్తారు. అలాగే కెంపుని ధరించటం వలన ప్రజా బలం పెరుగుతుంది. వారు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది.