కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ     2018-04-12   01:52:30  IST  Raghu V

చిత్రం : కృష్ణార్జున యుద్ధం
బ్యానర్ : షైన్ స్క్రీన్స్
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాతలు : సాహు గరపాటి
సంగీతం : హిప్ హాప్ తమీజా
విడుదల తేది : ఏప్రిల్ 14, 2018
నటీనటులు : నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ తదితరులు

కథలోకి వెళితే :

చిత్తూరు లో ఉండే కృష్ణ (నాని), దేశవిదేశాలు తిరిగి శ్రోతల్ని అలరించే రాక్ స్టార్ అర్జున్ (నాని) కి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా, ఇద్దరు చూడ్డానికి అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. కృష్ణ రియాతో (రుక్సర్) తో ప్రేమలో పడితే, అర్జున్ సుబ్బలక్ష్మి (అనుపమ) కి మనసు ఇస్తాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న తరుణంలో కథానాయికలు ఇద్దరు వారికి దూరమవుతారు. మరి ప్రేమని ఇద్దరు ఎలా తిరిగి దక్కించుకున్నారు, దానికోసం ఎలాంటి యుద్ధం చేసారు అనేది తెర మీదే చూడాలి‌.


నటీనటుల నటన :

నాని కృష్ణగా ఆకట్టుకుంటాడు. చిత్తురు యాసలో పండించిన కామెడి చాలాచోట్ల నవ్వు తెప్పిస్తుంది‌. కృష్ణ పాత్రలో ఉండే ఫక్తు అమాయకత్వం అందరికి కనెక్ట్ అవడం వలన ఆ పాత్ర ఉన్న సన్నివేశాలు బోర్ కొట్టించకుండా కదిలిపోతుంటాయి. ఇక సమస్య మొత్తం అర్జున్ పాత్రలోనే ఉంది. నాని పెద్దగా ఆకట్టుకోకపోవడం పక్కన పెడితే, మొదట నాని రాక్ స్టార్ లా కనిపించట్లేదు. కాస్త క్లీన్ షేవ్ చేయించి, ఫంకీ లుక్ ట్రై చేసుంటే ఆ పాత్రకు సరిపోయేదేమో. అనుపమ చేయడానికి పెద్దగా ఏమి లేదు. రుక్సర్ అందంగా ఉంది‌. కామెడియన్స్ పర్లేదు.