కాకినాడ కార్పొరేష‌న్ రిజ‌ల్ట్ ఇదేనా..!

నంద్యాల మ‌హాసంగ్రామం ముగిసింది. ఇప్పుడు అంద‌రిదృష్టి కాకినాడ రిజ‌ల్ట్ మీదే ఉంది. కాకినాడ మేయ‌ర్ పీఠం మాదే మాదే అంటూ ప్ర‌ధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ ధీమాతో ఉంటే కాంగ్రెస్ కూడా స‌త్తా చాటుతామ‌ని చెపుతోంది. మొత్తం కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకుగాను పొత్తులో భాగంగా 39 చోట్ల టీడీపీ, 9 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. ప్రతిపక్ష వైసీపీ 48 డివిజన్లలోనూ, ఉనికి చాటుకునేందుకు రెడీ అవుతోన్న కాంగ్రెస్ 17 డిజ‌విన్ల‌లోను పోటీకి దిగుతున్నాయి.

మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా 25 డివిజన్లు రావాల్సి ఉంది.అయితే ఇక్క‌డ కౌంటింగ్‌కు ముందే టీడీపీ ఖాతాలో మూడు ఓట్లు ప‌డ్డాయి. కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు, రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత‌లక్ష్మి, ఎమ్మెల్సీ ర‌వికిర‌ణ్ వ‌ర్మ ముగ్గురు టీడీపీకి కో ఆప్ష‌న్ స‌భ్యులుగా ఉన్నారు. ఇక ఇక్క‌డ గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి, రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం టీడీపీకి 30కు త‌గ్గ‌కుండా డివిజ‌న్లు వ‌స్తాయంటున్నారు.