కలల గురించి ఆసక్తికరమైన నిజాలు

నిద్రలో కలలు రావటం అనేది మానవ సహజం. మనకు వచ్చే కలలలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. మరి కొన్ని కలలు నిరాశను కలిగిస్తాయి. అయితే కొంత మంది మాత్రం తమకు వచ్చిన కలలు నిజం అవుతాయని నమ్ముతారు. కలలపై చాలా పరిశోదనాలు జరిగాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కలల గురించి ఎవరికీ తోచిన విధంగా వారు అర్ధాలను వెతుక్కోవటం సర్వసాదారణం అయ్యిపోయింది. అటువంటి కలల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1. మధ్య నిద్ర ముఖ్యం
నిద్రలో ఒక లోతైన దశను మధ్ నిద్ర అని అంటారు. ఈ మధ్య నిద్రలోనే కలలు వస్తూ ఉంటాయి. తగినంత నిద్ర లేకపోతే ఆందోళన, చిరాకు, కోపం మరియు భోజన క్రమరాహిత్యాల వంటి మానసిక సమస్యలు వస్తాయి.