కర్ణాటక సీఎం "కుమారస్వామి" భార్య గురించి ఈ షాకింగ్ నిజం మీకు తెలుసా.? ఆమె గురించి గూగుల్ లో నెటిజెన్స్ సెర్చ్!     2018-05-21   00:15:36  IST  Raghu V

ఎన్నో ట్విస్టులు…సీఎం ఎవరు అవుతారో అర్థం కాలేదు. రెండు రోజులు హై టెన్షన్. చివరికి క‌ర్నాట‌క సిఎంగా కుమార‌స్వామి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈక్ర‌మంలో ఆయ‌న గురించి మ‌రింత‌గా తెలుసుకోవాల‌నుకునే వారు ఆయ‌న పేరును గుగూల్ లో సెర్చ్ చేస్తారు.కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆయ‌న గురించి కాకుండా ఆయ‌న భార్య గురించి గుగూల్ లో వెతుకులాట ఎక్కువైంది. దీనంత‌టికి కార‌ణం కుమార‌స్వామి భార్య హీరోయిన్ కావ‌డ‌మే.! దానికి తోడు కుమార‌స్వామిది ల‌వ్ మ్యారేజ్ కావ‌డం. ఇది ఇద్ద‌రికీ రెండో వివాహం కావ‌డం కూడా నెటీజ‌న్లు అలా సెర్చ్ చేయ‌డానికి కార‌ణ‌మైంది.

16 ఇయ‌ర్స్ కే సినిమాల్లోకి ప్ర‌వేశించిన రాధిక క‌న్న‌డ, త‌మిల్ సినిమాల్లో మంచి పాత్ర‌లు పోషించారు. ఈ స‌మ‌యంలో కుమార‌స్వామి క‌న్న‌డ సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్ గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రాధిక‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి అది కాస్త ప్రేమ‌గా మారింది. అప్ప‌టికే కుమార‌స్వామికి పెళ్ళై నిఖిల్ గౌడ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 2006 లో రాధిక‌ను ర‌హ‌స్యంగా పెళ్ళి చేసుకున్న విష‌యం 2010 లో అంద‌రికీ తెలిసింది.