‘కబాలి’ ఫలితమే ‘కాలా’కి, ఎందుకంటే..?     2018-05-30   00:32:30  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గత కొంత కాలంగా సరైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అవుతున్నాడు. ఆయన సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రజినీకాంత్‌ ‘చంద్రముఖి’ చిత్రం తర్వాత అటువంటి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. అడపా దడపా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ‘కబాలి’ చిత్రంపై అంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని ఆ చిత్రంను రజినీకాంత్‌ ఎందుకు ఒప్పుకున్నాడా అని ఫ్యాన్స్‌ కూడా అనుకున్నారు.

‘కబాలి’ చిత్రం ఫ్లాప్‌ మర్చిపోకుండానే అదే చిత్ర దర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో తాజాగా ‘కాలా’ చిత్రాన్ని చేశాడు. స్టార్‌ హీరో తనకు ఒక ఫెయిల్యూర్‌ ఇచ్చిన దర్శకుడితో పని చేసేందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాని రజినీకాంత్‌ మాత్రం కారణం ఏంటో కాని రంజిత్‌ పాతో పని చేసేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ‘కబాలి’ ఫలితంను మర్చి పోయాడేమో ‘కాలా’ను ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు. సరే కబాలి విషయంలో జరిగిన తప్పులను మళ్లీ జరగకుండా చూసి, కాలా చిత్రాన్ని సక్సెస్‌ చేస్తాడని అంతా అనుకున్నారు. కాని కాలా చిత్రం కూడా కబాలి దారిలోనే వెళ్తుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.