'కన్నా'ను 'సున్నా' చేయడమెలా ..? టీడీపీ స్కెచ్ ఇదే !

ఏపీలో కొత్త రాజకీయ ఎత్తుగడలకు తెరతీసి బాబు ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అందుకే ఏపీలో బాబు హవా ఎలా తగ్గించాలనే విషయం మీద ప్రధానంగా దృష్టిపెట్టింది. టీడీపీకి ప్రధానంగా వెన్నుదన్నుగా ఉంటున్న కాపు సామాజిక వర్గంపై గురిపెట్టిన బీజేపీ ఆ సామజిక వర్గం నాయకులైన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు పదవులు కట్టబెట్టింది. అయితే బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ … గట్టి కౌంటర్ ఎటాక్ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. అందుకే ఇప్పుడు టీడీపీ సరికొత్త అస్త్రాలు ప్రయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

టీడీపీ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా విమర్శలు చేయకముందే ఆయన్ను బ్లేమ్ చేసి ఆయన దూకుడుకి కళ్లెం వెయ్యాలని టీడీపీ ప్లాన్. అందుకే కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉండగా చేసిన పొరపాట్లు, అవినీతి వ్యవహారాలూ, అప్పట్లో ఆయన మీద ఎలాంటి విమర్శలు వచ్చాయి? అనే విషయాలను బయటకి తీసి బీజేపీ పరువు తీయాలని టీడీపీ చూస్తోంది. కన్నా గతంలో నేదురుమిల్లి జనార్దనరెడ్డి – కోట్ల విజయభాస్కరరెడ్డి ల హయాంలోనే మంత్రిగా చేశారు.