కండలు పెరగాలంటే ఈ ఆహారపదార్థాలు అస్సలు తినొద్దు

ఈరోజుల్లో క్యూట్ గా ఉండే అబ్బాయిల కంటే, హాట్ గా ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపాడుతున్నారు అమ్మాయిలు. అంటే కాస్త ధృడంగా, కండలు తిరిగిన దేహంతో ఉండే మగవారి పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు అన్నమాట.అందుకే ఫిట్ నెస్ చాలా ముఖ్యమైపోయింది. మజిల్ ఉన్న మగవాడి అందం వేరు. ఒకేవేళ మీరు బాడి బిల్డింగ్ చేయాలి అనుకుంటే ఏం తినాలో మేం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాడి పెరగాలంటే ప్రోటీన్ ఉండే ఆహరం ఎక్కువ తినాలి అని ఇంటర్ పూర్తియైన ప్రతి పిల్లాడు చెబుతాడు. చికెన్, గుడ్లు, అరటిపండ్లు, ఇలా లిస్టు చదివేస్తాడు. ఏం తినాలో ఒకే, మరి ఏం తినకూడదు? కండలు పెంచాలి అనుకున్నప్పుడు మీ డైట్ లోంచి తీసేయవలసిన ఆ ఆహారపదార్థాలు ఏమిటి?

* Glycemic Index (GI) ఎక్కువ ఉండే ఆహారపదార్థాలను తినకూడదు. ఈ ఆహార పదార్థాలు షుగర్ లెవల్స్ ని పెంచాస్తాయి. మనం ఎక్కువగా తినే తెల్లబియ్యంతో పాటు బ్రెడ్, చీజ్, పైనాపిల్, స్వీట్ పొటాటో, కార్న్ ఫ్లేక్స్ ఈ క్యాటగిరిలోకి వస్తాయి. నొక్కి నొక్కి చెప్పాలంటే, తెల్ల బియ్యం పక్కనపెట్టండి.

* కండలు బాగా పెరగాలంటే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ నార్మల్ గా ఉండాలి. దాన్ని ఉత్పత్తి ఎక్కువ ఉండకూడదు. మీరు కూల్ డ్రింక్స్ ని ఇష్టంగా తాగేవారే అయితే, మీ ఇష్టాన్ని చంపుకోండి. ఆర్టిఫిషియల్ షుగర్స్ ని పక్కనపెట్టండి. ఇవి మామూలు షుగర్స్ కంటే ప్రమాదకరం.