ఒక్కడే భారత సైనికుడు, 300 మంది శత్రువులని ఒంటి చేతితో చంపాడు..చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే సైనికుడు..ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన స్టోరీ     2018-05-24   01:59:56  IST  Raghu V

మన కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి తన ప్రాణం గురించి ఆలోచించకుండా కాపు కాసేవాడే ‘సైనికుడు’..వారిని మనం గౌరవించాలి వాళ్ళు లేకుంటే మనకి రక్షణ లేదు , పిల్ల పాపలను వదిలి స్వార్థం లేకుండా బార్డర్ కి వెళ్లే సైనికులకు మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి , వాళ్లే దేశానికి నిజమైన హీరోలు..
జస్వంత్ సింగ్ రావత్ ఒక ధైర్యమైన రైఫైల్ మ్యాన్.అతను ఉన్న కాలం లో అతనికి మంచి పేరుంది,అతను శరీరంగా , మానసికంగా శిక్షణ పొందాడు. ఇతని ధైర్య సాహసలకు ఇతర దేశ ఆర్మీ సైనికులు కూడా అభిమానించేవారు.

1962 లో జరిగిన ఇండో – చైనా యుద్ధం లో రైఫైల్ మ్యాన్ జస్వంత్ సింగ్ పోరాటం అద్భుతం.అది 1962 నవంబర్ యుద్ధం చివరి దశలో ఉంది, తగిన ఆయుధాలు సామగ్రి లేక తనతో పాటు ఉన్న కొంత మంది సైనికులు తప్పుకున్నారు , కానీ ఆ సమయం లో కూడా వెనకంజ వేయకుండా దేశం కోసం ఒక్కడే నిలబడ్డాడు.. అప్పటికి ఆయుధాలు లేక చాలా ఇబ్బంది అయింది కానీ అక్కడ దగ్గర ప్రాంతం లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ‘ సేలా , నురా’ ల సహాయం తో పోరాటానికి సిద్ధమయ్యాడు.జస్వంత్ సింగ్ తన తెలివితేటలు ఉపయోగించి మూడు వివిధ చోట్ల ఆయుధాలను అమర్చి కాల్పులు ప్రారంభిచాడు.దానిని చూసి చైనా ఆర్మీ ముందుకు రాలేకపోయింది.ఇటువంటి ప్రణాళిక ద్వారా చైనీయులకు జస్వంత్ ఒక్కడే ఉన్నాడని తెలియదు.ఇలా కాల్పులు జరిపి 3 రోజుల పాటు మొత్తం చైనా సైనికులను ముందుకు కదలకుండా చేసాడు.