ఒకప్పుడు హోటల్ లో సర్వర్ ఇప్పుడు జబర్దస్త్ టీం లీడర్ , ఎవరో చూడండి..    2018-06-08   00:39:08  IST 

జబర్దస్త్ తెలుగు లో నెంబర్ వన్ కామెడీ షో , జబర్దస్త్ షో అందరికి నవ్వులు పంచడమే కాదు ఎందరో ఆర్టిస్ట్ లకి అవకాశాలు ఇచ్చి వారిని పాపులర్ చేసింది.చాలా మంది మారుమూల గ్రామీణ ప్రాంతాలలో నుండి వచ్చి జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ లో గుర్తింపు తో సినిమా అవకాశాలు కూడా దక్కిచుకున్న జబర్దస్త్ నటులు చాలానే ఉన్నారు.జబర్దస్త్ షో లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆర్టిస్ట్ రాచకొండ ప్రసాద్ (కిర్రాక్ ఆర్పీ), తన విలక్షణ హావభావాలతో కామెడీ చేయగల ఆర్టిస్ట్, కానీ ఇతను ఒకప్పుడు సర్వర్ గా పనిచేశాడు. ఇప్పుడు టీవీ లో కనిపిస్తున్న ఆర్పీ , ఒకప్పుడు హోటల్ లో సర్వర్ గా చేశారు , అసలు సర్వర్ నుండి జబర్దస్త్ షో కి రావడం కోసం చాలా కష్టపడ్డాడు.