ఒకప్పుడు టాప్ హీరోయిన్..కానీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసా.? కారణం ఆమె భర్త?     2018-06-06   01:12:30  IST  Raghu V

అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా అనగానే మనకు గుర్తొచ్చేది భూమిక..యువకుడు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ,ఖుషితో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.పవన్ కళ్యాన్, చిరంజీవి,నాగార్జున,ఎన్టీయార్,జగపతిబాబు లాంటి పెద్ద హీరోల సరసనే కాకుండా శివాజి,అల్లరి నరేష్ లతో కూడా నటించింది.అంతేకాదు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భూమిక పెళ్లి పిల్లలు తర్వాత కనుమరుగైపోయింది. ఇటీవలే ధోని, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది భూమిక.

యోగా ట్రెయినర్ భరత్ ఠాకూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది భూమిక వారికొక కుమారుడు కూడా..హీరోయిన్లకు పెళ్లి అయితే అవకాశాలు సన్నగిల్లడం,లేదంటే పెళ్లి తర్వాత వారే సినిమాలకు దూరంగా ఉండడం సర్వసాధారణం..కానీ సినిమాల ద్వారానే కాకుండా మరొక ఆదాయ మార్గం ఉంటే మళ్లీ ఇటు చూడని వారు అనేకమంది..