ఒకప్పుడు గర్భం రాకుండా ఉండటానికి ఆడవారు వాడే ఈ 5 చూస్తే షాక్ అవుతారు..!

గ‌ర్భాన్ని నిరోధించ‌డం కోసం పురుషుల‌కు, స్త్రీల‌కు వేర్వేరు ప‌ద్ధతులు అందుబాటులో ఉన్నాయి కానీ ఒక‌ప్పుడు అలా కాదు. అందుకే కొన్ని దేశాల్లో ఆ కాలంలో దంప‌తులు ఒక్కొక్క‌రు ఒక్క‌రు, ఇద్ద‌రు కాదు, ఏడేసి, ఎనిమిదేసి ఇంకొంద‌రు ప‌దుల సంఖ్య‌లో కూడా పిల్ల‌ల్ని క‌నేవారు. అప్పుడు జ‌నాభా నియంత్ర‌ణ‌, గ‌ర్భం రాకుండా నిరోధించ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌పై ప్ర‌జ‌ల్లో స‌రిగ్గా అవ‌గాహ‌న లేదు. కానీ కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే ఆ ప‌ద్ధతుల‌ను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా త‌క్కువే. అయితే వారు గ‌ర్భం రాకుండా ఉండేందుకు ఉప‌యోగించిన ప‌ద్ధతుల‌ను చూస్తే ఇప్ప‌టి వారు షాక్ అవ్వక త‌ప్ప‌దు.

నిమ్మ‌కాయ‌…
స‌గం కోసి పిండిన నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను అప్ప‌ట్లో కొంద‌రు మ‌హిళ‌లు త‌మ జ‌ననాంగాల వ‌ద్ద పెట్టుకునేవార‌ట‌. దాంతో నిమ్మ‌ర‌సం ఆ ప్ర‌దేశ‌మంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్క‌డికి వచ్చి చేరే శుక్ర క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ని వారు విశ్వ‌సించే వారు. దీంతోపాటు ఆ ప్ర‌దేశంలో ఉన్న బాక్టీరియా అంతా న‌శిస్తుంద‌ని కూడా వారు న‌మ్మేవారు. ఈ క్ర‌మంలో కొందరు స‌ఫ‌లీకృతులు కూడా అయిన‌ట్టు తెలుస్తోంది.

కోకా-కోలా…
అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కొంత మంది మ‌హిళ‌లు త‌మ యోనిలో కోకా కోలాను పోసుకునే వార‌ట‌. దీని వ‌ల్ల అక్క‌డి శుక్ర‌క‌ణాలు చనిపోతాయ‌ని వారు న‌మ్మేవారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేద‌ట. అలా వారు ప్ర‌య‌త్నించినా గ‌ర్భం వ‌చ్చేద‌ట‌.

అకాసియా, ఖ‌ర్జూరం, తేనె…
అకాసియా అనే ఓ మొక్క‌కు చెందిన ఆకుల‌ను తేనె, ఖ‌ర్జూరం క‌లిపిన మిశ్ర‌మంలో నాన‌బెట్టి వాటిని టాంప‌న్స్ అని పిల‌వ‌బ‌డే బిర‌డాల వంటి స‌హాయంతో కొంద‌రు ఈజిప్షియన్‌ మ‌హిళ‌లు త‌మ యోనిలో పెట్టుకునేవార‌ట‌.

ఈ ప‌ద్ధ‌తి వీర్యాన్ని నాశ‌నం చేసే స్పెర్మిసైడ్‌గా ప‌నిచేస్తుంద‌ని చెబుతారు.