ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసుకుందాం

రాసి చక్రం ప్రకారం పేర్లు పెట్టుకోవటం , రంగు రాళ్ల ఉంగరాలను పెట్టుకోవటం, వివాహాలు చేసుకోవటం మరియు శుభకార్యాలు చేసుకోవటం వరకు మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో జ్యోతిష్యులు ఉద్యోగం చేయటానికి ఏ రంగం బాగుంటుందో కూడా చెప్పుతున్నారు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌ను కూడా రాశుల ప్ర‌కార‌మే వాడాలని జ్యోతిష్యులు చెప్పుతున్నారు. 12 రాశుల వారు వారి రాశిని బట్టి ఏ స్మార్ట్ ఫోన్ వాడాలో తెలుసుకుందాం

మేష రాశి


ఈ రాశి వారికీ ఓపిక సహనం చాలా తక్కువగా ఉంటుంది. ఏ పనైనా చాలా స్పీడ్ గా జరగాలని కోరుకొనే మనస్తత్వం కలిగి ఉంటారు. అందువల్ల ఈ రాశివారు 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ వాడితే మంచిది. వీరికి ఈ మధ్యనే విడుదల అయిన వ‌న్ ప్ల‌స్ 5 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ గా ఉంటుందని చెప్పవచ్చు.

వృష‌భం


ఈ రాశివారు ప్రక్రుతి ప్రేమికులు. వీరు ఏ పని చేయాలన్నా ప్రణాళిక వేసుకొని రంగంలోకి దిగుతారు. అంతేకాక వీరు ఉన్నతంగా అలోచించి పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ఫోన్ బాగుంటుంది.

మిథునం


ఈ రాశివారు తమ భావాలను ఇతరులకు చాలా సృజనాత్మకంగా చెప్పటంలో నేర్పరులు. అలాగే వీరు నలుగురిలో ఉండటానికి కన్నా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశి వారు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది.