ఏపీ మంత్రి కొడుకు మిస్సింగ్  

పత్తికొండ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా ఉన్న నారాయణరెడ్డి మీద కొన్ని నెలల క్రితం హత్య జరిగింది. వేట కొడవళ్ళతో నరికి అత్యంత దారుణంగా చంపేశారు.ఈ హత్యలో ప్రధానంగా పత్తికొండ ఎమ్మెల్యే ,డిప్యూటీ సీయం కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ ఈ రెండు పేర్లు వినిపించాయి. కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు అక్రమ మైనింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నాడని నారాయణ రెడ్డి హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఆ రీచ్ ను మూసివేయమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ పరిణామాల తరువాత ఒక పెళ్ళికి వెళ్లి వస్తున్న నారాయణరెడ్డి ని సినీ ఫక్కీలో అడ్డుకుని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య విషయంలో ఇప్పటివరకూ పోలీసులు చర్యలని తీసుకున్న దాకలాలు లేవు.ప్రధాన నిందితుడు కే.ఈ .శ్యాంబాబు ని అరెస్టు చేయకుండా పోలీసులు అలసత్వం చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తునాయి దానికి కారణం డిప్యూటీ సీఎం కుమారుడు కావడమే అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికీ ఈ హత్య జరిగి సుమారు వందరోజులు దాటుతోంది.ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు మాత్రం నత్తనడకగా సాగుతుండటం అనేక అనుమానాలకి తావిస్తోంది. ఈ విషయంపై స్పందించిన పోలీసు అధికారులు శ్యాంబాబు ఎక్కడో ఉన్నారో తమకు తెలియదని – ఆయన ఆచూకీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతుండటం మరిన్ని అనుమానాలకి తావిస్తోంది. అధికార పార్టీ ఒత్తిడులకి తలొగ్గి కేసుని నీరుగార్చొద్దు అని నారాయణరెడ్డి కుటుంబీకులు కోరుతున్నారు.