ఏపీలో బీజేపీ వేసిన ప్లాన్..హర్యానాలో సీన్ రివర్స్     2018-06-08   00:15:15  IST  Bhanu C

ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడుతారు ఈ సామెత భారత దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది కానీ పాపం బీజేపీ కి మాత్రం తెలియరాలేదు..అందుకే కాబోలు ఏపీలో తానూ తీసిన గోతిలో తానే పడింది..అలా ఇలా కాదు బొక్కబోర్లా పడింది..ఏంటి అసలు విషయం చెప్పకుండా గొయ్యి నుయ్యి అంటున్నామనే కదా సరే అసలు విషయంలోకి వెళ్తే బీజేపి ని చూసి పాపం అనుకుంటూ పడీ పడీ నవ్వుతారు..

చంద్రబాబు ఎన్డీయే నుంచీ బయటకి వచ్చి బీజేపి పరువుని సెంట్రల్ లోని సెంటర్ లో తీసిపడేశారు ఈ దశలో మోడీ గారి పరువు దేసవ్యప్తంగా ఎలా పోయిందో వేరే చెప్పనవసరం లేదు ఆక్షణం నుంచీ మోడీ గారు చంద్రబాబు పై పెంచుకున్న పగని ఎలా తీచుకోవాలో అనుకున్న సమయంలో ఎన్నో వ్యుహాలని రచిస్తున్నారు..రంచించారు కూడా అయితే ఒక్కొక్కటి మెల్లగా జరుగుతున్నాయి అని తెలుస్తోంది..అయితే బిజెపి తాజాగా ఏపీలో చక్రం తిప్పాలని టీడీపీ ని భూస్తాపితం చేయాలనే తలంపుతో కుల రాజకీయ వ్యుహాలకి పదును పెట్టింది.అందులో భాగంగానే..