ఏపీలో పరకాల పాత్ర ముగిసినట్టేనా ..?     2018-05-22   02:37:58  IST  Bhanu C

ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు బీజేపీ – టీడీపీ కి మధ్య ఏర్పడిన విబేధాల వల్ల ఓ వ్యక్తి ఇప్పుడు కూరలో కరివేపాకులా మారాడు. ఒకప్పుడు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆయన ఇప్పుడు అమరావతి ఛాయలకు కూడా రావడం మానేసాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి ..? ఎందుకు కరివేపాకులా మారాడు అనేది తెలుసుకుందాం. !

పరకాల ప్రభాకర్ ! కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు భర్త . ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారుడు. ఇతడికి ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంపార్టెంట్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా కూడా పరకాల ఉండాల్సిందే. రాష్ట్రంలో కూడా ఏదైనా ముఖ్యమైన మీటింగ్ పెట్టినా అందులో పరకాల ప్రత్యక్షం అవ్వాల్సిందే. అంతగా ఆయనకు చంద్రబాబు ఇంపార్టెంట్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీతో పొత్తు చెడిన తరువాత ఇక పరకాల ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు అనే ఫీలింగ్ చంద్రబాబు లో వచ్చేసింది. పైపెచ్చు ఆయన్ను ఇంకా పక్కనపెట్టుకుని తిరగడం ఎప్పటికైనా డేంజర్ అనే భావన రావడం వల్ల ఆయనకు ఇంపార్టెంట్ కావాలనే తగ్గించేసారు.