ఏడు శనివారాలు శ్రీవారిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి     2018-05-29   02:22:00  IST  Raghu V

మన సంస్కృతిలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం. ఆపదలమెక్కువాడు వెంకటేశ్వర స్వామిని శనివారం పూజిస్తాం. సప్త గిరులపై వెలసిన ఆ ఏడుకొండలవాడు మనల్ని ఆపదల నుండి రక్షిస్తాడు. అలాగే కోరిన వరాలను ప్రసాదిస్తారు. శనీశ్వరుడు మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఎలా పూజించాలో వివరంగా తెలుసుకుందాం.

శనివారం తెల్లవారు జామునే లేచి తలస్నానము చేసి పూజగదిని అందంగా అలంకరించాలి. పూజ ప్రారంభం చేసి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండిలో పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిద తయారుచేసుకోవాలి. ఆ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున ఇలా చేస్తే స్వామి వారి కృప కలగటమే శని బాధ కూడా తొలగిపోతుంది.