ఏడు శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా తీరతాయి

మనకు శనివారం అనగానే ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆయనను వేడుకుంటే శని వలన కలిగే బాధలు అన్ని తొలగిపోతాయి. అందువల్ల నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు దోషాలు ఏమి ఉండవు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం ఆంటే చాలా ప్రీతి. అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకొన్న కోరికలు తప్పనిసరిగా తీరతాయి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం

శనివారం ఉదయం తలస్నానము చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని స్వామికి అలంకరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత బియ్యంపిండితో ప్రమిద చేయాలి. బియ్యంపిండిలో పాలు,బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీ పిండిలా కలిపి ప్రమిద చేయాలి. ఈ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి.