ఎన్నారై పెళ్ళిళ్ళు..48 గంటలే గడువు..లేకపోతే..     2018-06-08   00:16:33  IST  Raghu V

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ సంచలన ఆదేశాలు జారీ చేశారు..ఎన్నారైల వివాహాలని 48 గంటలలోగా దేశంలో ఎక్కడ జరుగుతున్నా సరే రిజిష్టరు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు..లా కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సుల దృష్ట్యా ఎన్నారైలు పెళ్లి చేసుకున్న తరువాత 30 రోజుల్లోగా రిజిస్టరు చేసుకోవాలని తెలిపారు…అయితే ఒక వేళ ఎవరైనా రిజిష్టరు చేసుకోక పొతే..

ఆ రిజష్టరు గడువు 30 రోజులు గనుకా దాటితే రోజుకు ఐదు రూపాయల చొప్పున జరిమానాను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్నారైలు చేసుకున్న వివాహాలను 48 గంటల్లోగా రిజిస్టరు చేయించుకోకుంటే వారి పాస్ పోర్టు, వీసాలను జారీ చేయమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు…ఇదిలాఉంటే ఎన్నారైల వివాహాలను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకి సంభందించిన డాటాబేస్ లో పొందు పరుస్తామని మనేకాగాంధీ ప్రకటించారు.