ఎన్టీఆర్ ముందు ఓడిపోయిన మహేష్     2017-09-15   23:30:01  IST  Raghu V

సూపర్ స్టార్ అనే ట్యాగ్ నిజంగా చాలా బరువైనది. వచ్చిన ప్రతి సినిమా రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. ఎక్కడ తగ్గినా, అది అవమానానికి తక్కువేమీ కాదు. మహేష్ బాబు ఓ రికార్డుకి చాలా దూరంలో నిలిచిపోయాడు. స్పైడర్ ట్రైలర్ ఎలాంటి కొత్త రికార్డులని నెలకొల్పలేకపోయింది. బాహుబలి ఎలాగో చాలా దూరం కాని, జై లవ కుశ మరియు డీజే – దువ్వాడ జగన్నాథం సినిమాల వ్యూస్ ని అందుకోలేకపోయింది స్పైడర్ ట్రైలర్. కేవలం యూట్యూబ్ వ్యూస్ నే కౌంట్ చేసుకుంటే, మొదటి 24 గంటల్లో కేవలం 3.78 మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది ఆ విడియో.

టాప్ 10 ట్రైలర్స్ (24 గంటల్లో) చూసుకుంటే, లిస్టు ఇలా ఉంది.

1.Baahubali2-21.7M
2.Jai Lava Kusa – 4.9M
3. DJ-4.6M
4. Spyder- 3.78M
5. Paisa Vasool – 2.9M
6. KhaidiNo 150-2.4M
7. Katamarayudu-2.16M
8. Gautamiputra Satakarni -2.13M
9. Dhruva-2.08M
10. Ninnu Kori – 2M

ఎన్టీఆర్ నెలకొల్పిన నాన్ బాహుబలి రికార్డుని చేరుకోలేకపోయాడు మహేష్. అయితే ఇందులో ప్రిన్స్ ని తక్కువ చేసి మాట్లాడటానికి ఏమి లేదు. ఎందుకంటే స్పైడర్ ట్రైలర్ ఒక రోజు ముందే లీక్ అయిపొయింది. దాంతో అర్థరాత్రి సడెన్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసింది యూనిట్. ఆ ప్రభావం వ్యూస్ మీద స్పష్టంగా కనిపిస్తోంది.