చంద్రబాబు కి ఎన్టీఆర్ చేసింది ఏంటి..? పవన్ షాకింగ్ కామెంట్స్     2018-05-29   03:08:00  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ తన పర్యటనలలో చంద్రబాబే టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు..శ్రీకాకుళం పర్యటనలో భాగంగా చంద్రబాబు పై పవన్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి..ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని టార్గెట్ చేశారు..చంద్రబాబు ఏపీ ప్రయోజనం కోసం చేసినది ఏమి లేదని..అసలు చంద్రబాబు సహకరించి ఉంటే రాష్ట్రానికి ఎప్పుడో ప్రత్యెక హోదా వచ్చేదని అయితే బాబు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి ఏపీ ప్రయోజనాలని తాకట్టు పెట్టారు అంటూ ధ్వజమెత్తారు.

చంద్రబాబు చేస్తున్న ధర్మ దీక్షల్లో ధర్మం ఎక్కడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు.. హోదా కోసం తాను చేస్తున్న కవాతులు, పోరాటం ఢిల్లీ పెద్దలు గమనిస్తారని తప్పకుండా మనకి న్యాయం జరుగుతుందని అన్నారు..శ్రీకాకుళం జిల్లా పోరాటయాత్రలో భాగంగా పవన్‌ సోమవారం పాలకొండ, రాజాం, రణస్థలం ప్రాంతాల్లో పర్యటించారు…ఈ సందర్భంలో తానూ చేస్తున్న ప్రసంగాలు ప్రజలకి తెలియకుండా కరెంటు తీస్తున్నారు. జనసైనికులపై దాడులు చేయించి జైళ్లలో పెడుతున్నారు…ఈ ఒక్క విషయం చాలు జనసేన బలం ఎలా ఉందొ తెలుసుకోవచ్చు అన్నారు పవన్ కళ్యాణ్