ఎన్టీఆర్‌ మోసం చేసినా.. కోపం లేదు     2018-05-04   00:45:01  IST  Raghu V

ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు కథను అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం చేయాలని దాదాపు అయిదు సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. చిన్న హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా కూడా స్టార్‌ హీరోతోనే దర్శకుడిగా పరిచయం అవ్వాలనే ఉద్దేశ్యంతో చాలా కాలం వెయిట్‌ చేశాడు. సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా కళ్యాణ్‌ రామ్‌ ఒక చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్న సమయంలో వారికి వంశీ దృష్టిలో పడ్డాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చిత్రం అంటూ కళ్యాణ్‌ రామ్‌ స్వయంగా మీడియా నోట్‌ విడుదల చేయడం జరిగింది. ఆచిత్రం అదుగో ఇదుగో అంటూ దాటవేస్తూ వచ్చి, చివరకు క్యాన్సిల్‌ అన్నారు.

కారణాలు చెప్పకుండానే కళ్యాణ్‌ రామ్‌ ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్‌ చేశాడు అంటూ ఆ మద్య రచయిత వక్కంతం వంశీ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. దర్శకుడిగా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎన్టీఆర్‌తో చేయాలనే ఉద్దేశ్యంతో తాను అన్నింటిని పక్కకు పెట్టాను అని, కాని వారు మాత్రం తనను మోసం చేశారు అంటూ అప్పుడు వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఈ రచయిత ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రంకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. నేడు విడుదలైన ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వంశీ మాట్లాడుతూ మరోసారి ఎన్టీఆర్‌ సినిమా గురించి వ్యాఖ్యలు చేశాడు.