ఎట్టకేలకు రాజశేఖర్‌కు దొరికేశాడు     2018-06-30   01:16:59  IST  Raghu V

యాంగ్రీయంగ్‌ మన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో మరియు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న హీరో రాజశేఖర్‌. ఈయన కొన్ని సంవత్సరాల ముందు వరకు స్టార్‌ హీరోలతో పోటీగా చిత్రాలు చేస్తూ వారికి ఏమాత్రం తీసిపోకుండా సక్సెస్‌లను దక్కించుకున్నాడు. ఈయన చేసిన ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. యాక్షన్‌ సినిమాలు మాస్‌ను ఉర్రూతలూగించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. దాదాపు పది సంవత్సరాలుగా రాజశేఖర్‌ నటించిన చిత్రాల్లో ఒక్క గరుడవేగ చిత్రం మినహా ఏ ఒక్కటి సక్సెస్‌ కాలేదు. ఈమద్య గరుడవేగ సక్సెస్‌ దక్కడంతో రాజశేఖర్‌ ఇంకా కొన్నాళ్ల పాటు హీరోగా నటించాలని భావిస్తున్నాడు.

గరుడవేగ చిత్రం కూడా ఫలితం తారుమారు అయ్యి ఉంటే ఖచ్చితంగా రాజశేఖర్‌ ఇప్పటికే విన్‌ లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యేవాడు. కాని గరుడవేగ చిత్రంతో ఆయనలో హీరో ఇంకా బతికే ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆయనలోని హీరోకు గరుడవేగ ప్రాణం పోసినట్లయ్యింది. ఆ చిత్రం తర్వాత రాజశేఖర్‌ ఇక వరుసగా హీరోగా చిత్రాలు చేయాలని భావించాడు. అయితే ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు ముందుకు రావడం లేదు. వచ్చిన ఇద్దరు ముగ్గురు దర్శకుల కథలు రాజశేఖర్‌కు నచ్చలేదు.